BREAKING
పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం
www.ntodaynews.com

చింతలపూడి రేచర్లలో ప్రతిపాదిత బొగ్గు గనిపై రైతుల ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 03:51 PM
17 వీక్షణలు

డీపీఆర్‌ ప్రకటించాలి.. ప్రజాభిప్రాయం లేకుండా నిర్ణయాలు వద్దు

రిలయన్స్‌కు భూములు ఇచ్చేది లేదని రైతుల స్పష్టీకరణ

చింతలపూడి, ఆగస్టు 28:

ప్రతిపాదిత బొగ్గు గని (యూసీజీ) ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను వెంటనే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.

చింతలపూడి మండలం రేచర్లలో గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ఎగ్జిట్‌ పాయింట్‌ సమీపంలో శుక్రవారం ప్రతిపాదిత బొగ్గు గని ప్రాంత రైతులు, ప్రజల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కె. శరత్‌కుమార్‌ అధ్యక్షత వహించారు. సమావేశంలో రైతులు, ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం బొగ్గు గని పరిశోధన కోసం సుమారు 40 ఏళ్ల క్రితం వేసిన బోరును రైతు, ప్రజా సంఘాల నాయకులు పరిశీలించారు.

ఈ సందర్భంగా కె. ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. లక్షల కోట్ల విలువైన ప్రజా సంపదను ప్రైవేటు సంస్థలకు ఏ విధంగా అప్పగిస్తారని ప్రశ్నించారు. రైతులు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా బొగ్గు ఆధారిత గ్యాస్‌ ఉత్పత్తికి అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు.

లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని, ప్రాంత అభివృద్ధి జరుగుతుందని చెబుతున్న ప్రభుత్వాలు.. పర్యావరణం, వ్యవసాయం, ప్రజల జీవనంపై పడే ప్రభావాలను వివరించడం లేదని విమర్శించారు. బొగ్గు ఆధారిత గ్యాస్‌ ఉత్పత్తి వల్ల కలిగే నష్టాలపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.

ఈ ప్రాంతంలో ఆయిల్‌పామ్‌, కోకో, కొబ్బరి, అరటి, మొక్కజొన్న, వరి తదితర ఉద్యాన, వాణిజ్య పంటలు విస్తృతంగా సాగుతున్నాయని, ఇలాంటి సస్యశ్యామల ప్రాంతంలో పర్యావరణానికి ముప్పు కలిగించే చర్యలను అనుమతించబోమని తెలిపారు. గ్రామసభలు నిర్వహించి పూర్తి వివరాలను ప్రజలకు తెలియజేయాలని కోరారు.

రైతు సంఘాలు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌. లింగరాజు, కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి దొంతా కృష్ణ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తొర్లపాటి బాబు తదితరులు మాట్లాడుతూ.. గతంలో జరిగిన భూసేకరణల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు.

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణ సమయంలో ఎదురైన సమస్యలను ప్రస్తావిస్తూ.. ప్రస్తుతం ప్రతిపాదిత బొగ్గు గని విషయంలోనూ వాస్తవాలను దాచిపెడితే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

భూములు ఇచ్చేది లేదని రైతుల స్పష్టం

ప్రతిపాదిత గని ప్రాంత రైతులు చిక్కాల శ్రీనివాసరావు, కొండుబోయిన శివరామకృష్ణ, బాణావతి ఆలీ, పి. చక్రధరరావు, కొనకళ్ల రాఘవరావు మాట్లాడుతూ.. రిలయన్స్‌ కంపెనీకి తమ భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. తమ జీవనాధారమైన భూములను, గ్రామాల భవిష్యత్తును నాశనం చేసే నిర్ణయాలను అంగీకరించబోమన్నారు.

ప్రభుత్వం తమ వైఖరిని వెంటనే ప్రకటించాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

సమావేశంలో తీర్మానాలు:

ప్రతిపాదిత బొగ్గు గని (యూసీజీ) డీపీఆర్‌ను వెంటనే ప్రకటించాలి.

ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలి.

గ్రామసభలు ఏర్పాటు చేసి వాస్తవ వివరాలను ప్రజలకు తెలియజేయాలి.

బలవంతపు భూసేకరణను అంగీకరించేది లేదు.

ఈ సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు పాల్గొన్నారు.