BREAKING
చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం చిత్తూరులో మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు గుడిపాల మండలం లో విషాదం గురజాలలో గ్రామ సభ.. అభివృద్ధిపై చర్చ ఆదాయ, వ్యయ వివరాల వెల్లడి.... నవంబర్‌ 15న ఏపీలో NMMS పరీక్ష ఘనంగా టిపిటిఎఫ్ అధ్యక్షుడు నర్రా బిక్షం రెడ్డి జన్మదిన వేడుకలు వెల్లంకి గ్రామంలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా రోడ్డు పక్కనే పశువు కళేబరం : దుర్వాసనతో ప్రయాణికులకు అవస్థలు! రావులపాలెం గ్రామపంచాయతీలో ఏసీబీ తనిఖీలు గుండ్రాంపల్లిలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలకు శ్రీకారం
Date of Publish : 11 September 2026, 03:49 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడిలో 100 పడకల ఆసుపత్రి పనుల పరిశీలన

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Sep, 2026 - 03:49 PM
10 వీక్షణలు

చింతలపూడి నియోజకవర్గ రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు 

చింతలపూడి, ఏలూరు జిల్లా: చింతలపూడి నియోజకవర్గ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చింతలపూడిలోని ఆసుపత్రి నిర్మాణ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎమ్మెల్యే, ఇప్పటివరకు పూర్తయిన పనులు, చేపట్టాల్సిన పనుల వివరాలను ఇంజినీరింగ్ అధికారులు, సంబంధిత నిర్మాణ సంస్థ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా నిర్మాణాన్ని పూర్తి చేయాలని, అదే సమయంలో నిర్మాణ నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ మాట్లాడుతూ చింతలపూడి ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆసుపత్రి నిర్మాణ పనులు నత్తనడకన సాగాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దీనికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. 100 పడకల ఆసుపత్రి అందుబాటులోకి వస్తే చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట, టి.నరసాపురం మండలాల ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని అన్నారు. అత్యవసర వైద్యం, ప్రసూతి సేవలు, నిపుణులైన వైద్యుల సేవలు స్థానికంగానే అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ఆసుపత్రిని త్వరగా ప్రారంభించేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆసుపత్రి పూర్తయిన అనంతరం వైద్యుల కొరత లేకుండా అవసరమైన చర్యలు చేపడతామని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆధునిక వైద్య పరికరాలను సమకూర్చేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆసుపత్రి అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.