BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 18 March 2026, 12:18 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చింతలపూడిలో ప్రైవేట్ పాఠశాలలతో విద్యాశాఖ ప్రత్యేక సమావేశం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Mar, 2026 - 12:18 AM
184 వీక్షణలు

ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలోని బాయ్స్ హైస్కూల్‌లో మంగళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్స్‌తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డివిజనల్ ఉప విద్యాశాఖ అధికారి డాక్టర్ పి.ఎస్. సుధాకర్ మాట్లాడుతూ, విద్యార్థులకు ఒత్తిడి లేని, విలువలతో కూడిన విద్యను అందించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విజన్ 2047 సాధనలో విద్యా రంగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

విద్యార్థులకు బలవంతంగా కాకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలో బోధన కొనసాగిస్తూ, చదువుపై ఆసక్తి పెంపొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మానసికంగా, శారీరకంగా విద్యార్థులను దృఢంగా తయారు చేస్తూ, చదువుతో పాటు మనోధైర్యాన్ని పెంపొందించాలన్నారు. సమాజం పట్ల సేవా దృక్పథంతో ఎదిగేలా విద్యార్థులను తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల బాధ్యత అని చెప్పారు.

ప్రధాని ప్రతిపాదించిన వికసిత భారత్, రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న స్వర్ణాంధ్ర, విజన్ 2047 సాధనలో భాగంగా వినూత్న బోధన పద్ధతులు అనుసరించాలని ఉపాధ్యాయులకు సూచించారు. రానున్న 2026–27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకునే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎంఈఓ రామరావు సహా మండలాల ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్స్ పాల్గొన్నారు.