BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 03 June 2026, 05:44 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

చిన్మయ మిషన్ 75 సంవత్సరాల చిన్మయ అమృత మహోత్సవాలు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
03 Jun, 2026 - 05:44 PM
57 వీక్షణలు

చిన్మయ మిషన్ 75 సంవత్సరాల చిన్మయ అమృత మహోత్సవాలు పురస్కరించుకొని నిర్వహిస్తున్న చిన్మయ అమృత యాత్ర ఈరోజు చిలకలూరిపేటకు విచ్చేసిన సందర్భంగా పట్టణంలోని చిన్మయ మిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా పాల్గొన్న శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్, లలితమ్మ ...

ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ గారు మాట్లాడుతూ… స్వామి చిన్మయానంద సరస్వతి గారి ప్రవచనాలు ప్రపంచవ్యాప్తంగా 27 దేశాలకు వ్యాపించి ప్రజల్లో జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. జ్ఞానం ద్వారా మంచి సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని, ప్రజలు జ్ఞానవంతులైతే ప్రపంచం అద్భుతంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో కనిపిస్తున్న హింస, స్వార్థం, ఉగ్రవాదం వంటి అనేక రుగ్మతలకు మూల కారణం జ్ఞానలేమేనని అన్నారు.

భగవద్గీత, ఉపనిషత్తులు, వేదాలు వంటి హిందూ ధర్మ గ్రంథాల్లో ఉన్న గొప్ప సందేశాలను ప్రజలకు చేరవేసే లక్ష్యంతో స్వామి చిన్మయానంద సరస్వతి గారు ప్రారంభించిన ఈ ఆధ్యాత్మిక ఉద్యమం నేడు ప్రపంచవ్యాప్తంగా 27 దేశాలలో విస్తరించడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు.

హిందూ ధర్మ ప్రచారం, మానవాళి శ్రేయస్సు కోసం తమ జీవితాలను అంకితం చేసి సేవ చేస్తున్న చిన్మయ మిషన్ సభ్యులందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.