BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 20 April 2026, 06:12 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిన్నంపేట గ్రామంలో గడ్డి కాలిపోవడంతో 25 వేల రూపాయల నష్టం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Apr, 2026 - 06:12 PM
164 వీక్షణలు

చిన్నంపేట గ్రామంలో గడ్డి కాలిపోవడంతో 25 వేల రూపాయల నష్టం

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో సోమవారం మధ్యాహ్నం ఘోరమైన అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పరసా వెంకటేశ్వరాకు చెందిన మూడు ఎకరాల గడ్డివాము పూర్తిగా కాలి బూడిదగా మారింది. ఈ ప్రమాదంలో సుమారు 25 వేల రూపాయల విలువైన గడ్డి కాలిపోయింది. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, నోరులేని మూగజీవాలకు మేత కరువైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ అనుబంధ వ్యవసాయ కార్మిక సంఘం చాట్రాయి మండల కార్యదర్శి కొమ్ము ఆనందం మాట్లాడుతూ, "చాట్రాయి మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగిందని చింతలపూడి ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేసినప్పుడు వారు విస్సన్నపేట ఫైర్ స్టేషన్ కు కాల్ చేయమని చెప్పారని విస్సన్నపేట స్టేషన్ వారికి చేయగా తమ పరిధిలో అది లేదని, చింతలపూడి ఫైర్ స్టేషన్ వారే రావాలని చెప్పారని దీంతో చింతలపూడి ఫైర్ స్టేషన్ వారు వచ్చిన తరువాత మంటలను అదుపు చేశారు" అని అన్నారు. కొమ్ము ఆనందం, "ఈ విధమైన ప్రమాదాలకు సమయానికి స్పందించేందుకు చాట్రాయి మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది" అని వెల్లడించారు.