BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 22 August 2026, 11:01 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిట్టేలలో పోలీసుల పల్లె నిద్ర.. ప్రశాంత ఎన్నికలే లక్ష్యం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Aug, 2026 - 11:01 AM
66 వీక్షణలు

చిట్టేలలో పోలీసుల పల్లె నిద్ర.. ప్రశాంత ఎన్నికలే లక్ష్యం

తిరువూరు, ఆగస్టు 22: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సున్నితమైన గ్రామాల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రజల్లో భద్రతా భరోసా కల్పించే ఉద్దేశంతో తిరువూరు మండలం చిట్టేల గ్రామంలో శుక్రవారం రాత్రి పోలీసులు ‘పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు.

తిరువూరు పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ శాతకర్ణి, ఎస్‌ఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గ్రామంలో రాత్రి బస చేశారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టడం, గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.

ఈ సందర్భంగా గ్రామంలోని సున్నిత ప్రాంతాలను పరిశీలించిన పోలీసులు ప్రజలతో మమేకమై వారి సమస్యలు, భద్రతకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలు, బెదిరింపులు, వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని ఎస్‌ఐ శాతకర్ణి తెలిపారు. గ్రామాల్లో ప్రజలకు భద్రతపై నమ్మకం కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

అదే సమయంలో పోలీసులు ‘ఖాకీ స్టూడియో’ వీడియోల ద్వారా గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. యువత, పిల్లలు గంజాయి, బెట్టింగ్‌లు, అతివేగ వాహన నడపడం వంటి చెడు అలవాట్లకు గురికాకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సున్నిత గ్రామాల్లో పోలీసులే ప్రజల మధ్య బస చేస్తూ భద్రతా చర్యలు చేపట్టడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. పోలీసుల పల్లె నిద్ర కార్యక్రమం ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంతో పాటు ఎన్నికల సమయంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.