BREAKING
thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 13 July 2026, 09:34 pm
Posted by : కూనురు మధు

చిట్యాల హైవేపై డీజిల్ దొంగతనం : లారీలో డీజిల్ ట్యాంక్ గుల్ల

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
13 Jul, 2026 - 09:34 PM
232 వీక్షణలు

నల్గొండ జిల్లా చిట్యాల పరిధిలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై లారీ డ్రైవర్లు కంటిమీద కునుకు వేయాలంటేనే భయపడిపోతున్నారు వాహనం పక్కన నిలిపి కాసేపు విశ్రాంతి తీసుకుందామా అంటే  క్షణాల్లో డీజిల్ ట్యాంకులను గుల్ల చేస్తూ దొంగల ముఠా రెచ్చిపోతోంది. తాజాగా నల్లగొండ జిల్లా చిట్యాల పరిధిలో అర్ధరాత్రి వేళ ఒక భారీ లో డీజిల్ చోరీ కలకలం సృష్టించింది. లారీ ట్యాంక్ మూత పగులగొట్టి ఏకంగా 350 లీటర్ల డీజిల్‌ను దుండగులు చాకచక్యంగా దోచేశారు. బాధితుడు కథనం  ప్రకారం కోదాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఒక లారీ డ్రైవర్‌కు అర్ధరాత్రి సమయంలో తీవ్రంగా నిద్ర వచ్చింది. దీంతో సురక్షితంగా ఉంటుందని భావించి, చిట్యాల సమీపంలోని దుర్గా హోటల్' వద్ద లారీని రోడ్డు పక్కన పార్కింగ్ చేసి క్యాబిన్‌లో నిద్రపోయాడు. డ్రైవర్ గాఢ నిద్రలోకి జారుకున్న విషయాన్ని గమనించిన దొంగల ముఠా తక్షణమే రంగంలోకి  దొంగలు ఒక పక్కా ప్లాన్ ప్రకారం కారులో వచ్చారు అని . లారీ పక్కనే తెలియని అనుమానాస్పద కారును నిలిపి, ఐరన్ రాడ్ల సహాయంతో లారీ డీజిల్ ట్యాంక్ మూతను పగులగొట్టారు.అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా పైపుల ద్వారా సుమారు 350 లీటర్ల డీజిల్‌ను తమ వాహనంలోకి గుంజేసి చాకచక్యంగా మాయం చేశారు అని తెలిపారు. ​అయితే, అక్కడ కారు అనుమానాస్పదంగా ఆగి ఉండటాన్ని గమనించిన కొందరు స్థానికులు ఆ కారు ఫోటోలను మొబైల్స్‌లో బంధించినట్లు సమాచారం. డ్రైవర్ నిద్ర లేచి చూసేసరికి ట్యాంక్ ఖాళీ అవ్వడం, దొంగలు అప్పటికే అక్కడి నుంచి పరారవ్వడం జరిగిపోయాయి. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని పోలీసులను బాధితుడు వేడుకుంటున్నాడు