BREAKING
thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● ఠానూ నాయక్ నంగారా ఉత్సవాలను జయప్రదం చేయండి thumb ● నంద్యాలలో కులమతాలకు అతీతంగా పితృదేవతలకు తర్పణ కార్యక్రమం thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు
Date of Publish : 22 June 2026, 08:11 pm
Posted by : కూనురు మధు

చిట్యాల మండలంలో బీఎల్ఓలకు శిక్షణ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
22 Jun, 2026 - 08:11 PM
107 వీక్షణలు

జూన్ 25 నుండి ఇంటింటి సర్వే ప్రారంభం

నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని బూత్ స్థాయి అధికారులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్లు తహసీల్దార్ ఒక ప్రకటనలో తెలిపారు. చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించిన ఈ శిక్షణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియపై అధికారులకు పూర్తి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శిక్షణ పూర్తి చేసుకున్న బీఎల్ఓలకు ఎన్యూమరేషన్ ఫారాలు  ఇతర అవసరమైన మెటీరియల్‌ను పంపిణీ చేశారు. ​ఇంటింటి సర్వే  షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుండి బీఎల్ఓలు మండల వ్యాప్తంగా ఇంటింటి సర్వే ప్రారంభించనున్నారు. చిట్యాల ​మండలంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, విజయవంతంగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఉన్నతాధికారులు సిబ్బందిని ఆదేశించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ సుధాకర్ రెడ్డి, మండలంలోని బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్‌వైజర్లు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.