BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 22 June 2026, 08:16 pm
Posted by : V శ్రీనివాస్

మొహరం పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి: అదనపు కలెక్టర్ వి. రాములు

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
22 Jun, 2026 - 08:16 PM
155 వీక్షణలు

మొహరం పండుగను మత సామరస్యంతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు పిలుపునిచ్చారు. సోమవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జూన్ 26న జరగనున్న మొహరం పండుగ సందర్భంగా పీరీల నిర్వహణ, ఊరేగింపుల కోసం అన్ని శాఖల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. త్రాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రార్థనా మందిరాలు, పీరీల వద్ద పరిశుభ్రతతో పాటు తగిన లైటింగ్ ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అగ్నిమాపక, వైద్య ఆరోగ్య శాఖలు అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు