BREAKING
thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్ thumb ● బోయకొండ గంగమ్మ దేవస్థానం ఈవోపై కలెక్టర్‌కు ఫిర్యాదు thumb ● కాగిత రామచంద్రపురంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం thumb ● నంద్యాలలో పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఫరూక్ thumb ● నల్లమలలో పులుల సంరక్షణకు కొత్తగా 40 బేస్ క్యాంపులు thumb ● సీబీజీ ప్లాంట్‌తో ఇబ్బందులు.. చర్యలు తీసుకోవాలని సూరారం గ్రామస్తుల వినతి thumb ● పుంగనూరులో సిమెంట్ లారీలతో ట్రాఫిక్ ఇబ్బందులు thumb ● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ thumb ● పేద ప్రజలకు సీఎం సహాయ నిధి అండ thumb ● బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న టీడీపీ: పాటి శివకుమార్ thumb ● మైనర్ బాలికపై నేరం కేసులో నిందితుడి అరెస్ట్
Date of Publish : 22 June 2026, 08:15 pm
Posted by : కూనురు మధు

సొంత నిధులతో నోట్ బుక్స్ అందజేసిన సర్పంచ్.

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / తల్లవెల్లంల
22 Jun, 2026 - 08:15 PM
135 వీక్షణలు

చిట్యాల మండలం తాళ్ల వెల్లంల ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామ సర్పంచ్ జోగు సురేష్ తన సొంత నిధులతో విద్యార్థులకు కాపీ రైటింగ్ నోట్‌బుక్స్, పుస్తకాలను సోమవారం అందజేశారు. విద్యాభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశంతో రూ.16 వేల రూపాయల విలువైన నోట్‌బుక్స్‌ను కొనుగోలు చేసి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జోగు సురేష్ మాట్లాడుతూ, గ్రామంలోని విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన సహకారం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సర్పంచ్ చేసిన సహాయాన్ని అభినందించారు. విద్యార్థులు కూడా నోట్‌బుక్స్, పాఠ్యపుస్తకాలు అందుకోవడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పామునుగుల్ల సునీత-బుచ్చిరాములు, వార్డు సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు,  పాల్గొన్నారు.