BREAKING
thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం thumb ● నైపుణ్యాభివృద్ధితో స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలి :ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. thumb ● నంద్యాల సబ్ కలెక్టర్‌గా మనీషా ఐఏఎస్ బాధ్యతలు thumb ● జనసేనలోకి 100 కుటుంబాల చేరిక thumb ● నల్లమల ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు, బొలెరో ఢీ thumb ● జర్నలిస్టులకు క్యాష్‌లెస్‌ ఈజేహెచ్‌ఎస్‌ కార్డులు ఇవ్వాలి thumb ● చౌడేపల్లి తహశీల్దార్‌పై లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తాం..! thumb ● వైసీపీ మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలిగా ఝాన్సీ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది thumb ● పటాన్‌చెరులో ఆర్టీసీ యూనియన్ ఎన్నికల సందడి thumb ● ఫామ్-7 అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి కుట్రదారులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం
Date of Publish : 20 May 2026, 06:08 pm
Posted by : కూనురు మధు

చిట్యాలలో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ ముఖ్య నాయకుల సమరశంఖం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
20 May, 2026 - 06:08 PM
137 వీక్షణలు

చిట్యాలలో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ ముఖ్య నాయకుల సమరశంఖం NTODAY NEWS 

25న నల్లగొండలో విస్తృత స్థాయి సమావేశానికి జయప్రదం చేయాలని పిలుపు

ఈనెల 25న నల్గొండలో నిర్వహించ తలపెట్టిన ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం చిట్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ గార్డెన్‌లో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ అనుబంధ సంఘాల నకిరేకల్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం మాదిగ సంయుక్తంగా మాట్లాడారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పోరాట ఫలితంగా తెలంగాణలో లభించిన 9 శాతం రిజర్వేషన్ ఫలాలను మాదిగ విద్యార్థులు, నిరుద్యోగులు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించేందుకు 'గో టు విలేజ్' కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. మే 25న జరిగే జిల్లా విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోవింద్ నరేష్ మాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతారని నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నకిరేకల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ రాష్ట్ర నాయకులు మేడి శంకర్ మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరసాని గోపాల్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షుడు మాచర్ల సుదర్శన్ మాదిగ, చిట్యాల మండల అధ్యక్షుడు నోముల పురుషోత్తం మాదిగ, నకిరేకల్ మండల అధ్యక్షుడు గాదె రాజు మాదిగ, కేతపల్లి మండల అధ్యక్షుడు వెంకటరత్నం మాదిగ, కావలి కృష్ణ మాదిగ, మహంకాళి శీను మాదిగ, జానయ్య, పంది నాగయ్య, సైదులు తదితరులు పాల్గొన్నారు.