BREAKING
పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?...
Date of Publish : 30 March 2026, 06:33 pm
Posted by : కూనురు మధు

చిట్యాలలో వరుస మొబైల్ చోరీలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
30 Mar, 2026 - 06:33 PM
583 వీక్షణలు

చిట్యాలలో వరుస మొబైల్ చోరీలు 

ప్రయాణకులే టార్గెట్ల చోరీలకు పాల్పడుతున్న ముఠా


నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో గత వారం రోజులుగా వరుసగా జరుగుతున్న మొబైల్ ఫోన్ల దొంగతనాలు స్థానిక ప్రజలను ప్రయాణికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.  రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఆసరాగా చేసుకొని దొంగలు రెచ్చిపోతున్నారు. ప్రయాణికులే లక్ష్యంగా మొబైల్ చోరీలకు పాల్పడుతున్నారు అని సమాచారం.  ​స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. చిట్యాల బస్టాండ్ మరియు భువనగిరి రోడ్డు పరిసర ప్రాంతాల్లో ఈ చోరీలు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా బస్సు ఎక్కే సమయంలో ప్రయాణికుల రద్దీని ఆసరాగా చేసుకుంటున్న దొంగలు  వారి జేబుల్లోని ఫోన్లను అత్యంత చాకచక్యంగా మాయం చేస్తున్నారు. చిట్యాలలో బస్టాండ్, భువనగిరి రోడ్డుబ్లో  బస్సు ఎక్కే క్రమంలో తోపులాటను సృష్టించి ఫోన్లు దొంగతనం చేస్తున్నారు. ​వరుస దొంగతనాలతో విసిగిపోయిన బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు  ఇప్పటికే పలువురు బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. బహిరంగ ప్రదేశాల్లో భద్రతను పర్యవేక్షించాలని, సీసీ కెమెరాల ద్వారా దొంగలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రయాణికులు బస్టాండ్ వంటి రద్దీ ప్రాంతాల్లో తమ విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.