BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 23 June 2026, 06:24 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చిత్తపూరు, సోమవరం గ్రామాల శివారులలో పేకాట స్థావరాలపై చాట్రాయి పోలీసుల వరుస దాడులు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 06:24 AM
149 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామ శివారులో నిర్వహిస్తున్న పేకాట స్థావరాలపై చాట్రాయి పోలీసులు వరుసగా దాడులు నిర్వహించారు. చాట్రాయి ఎస్సై డి. రామకృష్ణకు అందిన సమాచారం మేరకు జూన్ 22న చేపట్టిన దాడుల్లో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు మోటార్‌సైకిళ్లు, రూ.10,300 నగదు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

అదే విధంగా సోమవారం గ్రామ శివారులో మరో పేకాట స్థావరంపై దాడి నిర్వహించి ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఆరు మోటార్‌సైకిళ్లు, రూ.15,150 నగదు, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి మొత్తం తొమ్మిది మందిపై చాట్రాయి పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు ఎస్సై డి. రామకృష్ణ తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్సై డి. రామకృష్ణ మాట్లాడుతూ జూదం వంటి అక్రమ కార్యకలాపాలు వ్యక్తులు, కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీస్తాయని అన్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో పేకాట వంటి జూదాలకు అలవాటు పడటం వల్ల కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు, సామాజిక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని సూచించారు. జూద క్రీడలను నిర్వహించే వారిపైనా, వాటిలో పాల్గొనే వారిపైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మండలంలో ఎక్కడైనా పేకాట, జూదం లేదా ఇతర అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే డయల్-112కు లేదా స్థానిక పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు. జూదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించబోమని, ఇటువంటి కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఎస్సై స్పష్టం చేశారు.