BREAKING
thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● నారాయణపురంలో రసాయన వాసనతో ప్రజల ఇబ్బందులు.. thumb ● పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన జీవనం
Date of Publish : 25 April 2026, 03:32 pm
Posted by : V శ్రీనివాస్

చల్లని కబురు ఈసారి ముందుగానే రుతుపవనాలు

తెలంగాణ
/ తెలంగాణ / హైదరాబాద్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
25 Apr, 2026 - 03:32 PM
148 వీక్షణలు
చల్లని కబురు, ఈసారి ముందుగానే రుతుపవనాలు- కేరళ తీరాన్ని తాకేది ఎప్పుడంటే.

మే చివరి వారంలోనే కేరళకు రుతుపవనాలు

​ 2009 తర్వాత మళ్లీ ఇప్పుడే.. 15 ఏళ్ల రికార్డ్ బ్రేక్

తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లోనూ భారీ ఉష్ణోగ్రతలు.. అదే సమయంలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ సారి వర్షాకాలం ముందే రానున్నట్లు వెల్లడించింది. నైరుతీ రుతు ప‌వ‌నాలు కేర‌ళ‌ను తాకే తేదీల పైన స్పష్టత వచ్చింది. కాగా, ఒక వైపు ఎండలు మండుతున్న సమయంలో నే రెండు తెలుగు రాష్ట్రాల్లో ద్రోణి ప్రభావంతో కొన్ని ప్రాంతాలకు వర్షాల అలర్ట్స్ జారీ అయ్యాయి.ఈ సారి ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఎండలు మండుతున్న వేళ వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ సారి నైరుతి రుతుపవనాలు ముందుగానే కేరళను తాకనున్నాయి. మరో మూడు రోజుల్లో అండ మాన్ ను తాకనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మే 25న కేరళను తాకనున్నట్లు వెల్లడించారు. అంచ‌నా వేసిన‌ట్లు ముందుగానే రుతుప‌వ‌నాలు కేర‌ళ‌ను చేరితే, అప్పుడు 2009 త‌ర్వాత తొలిసారి వ‌ర్షాకాలం ముందుగా వ‌స్తున్న‌ట్లు ఐఎండీ వెల్ల‌డించింది. 2009 సంవ‌త్స‌ రంలో మే 23వ తేదీన నైరుతీ కేర‌ళ‌ను తాకిన‌ట్లు ఐఎండీ డేటా చబుతోంది. సాధార‌ణంగా జూన్ ఒక‌టో తేదీ వ‌ర‌కు కేర‌ళ‌లోకి నైరుతీ రుతుప‌వ‌నాలు ప్ర‌వేశిస్తాయి. ఈ రుతుప‌వ‌నాల రాకతో వ‌ర్షాకాలం ప్రారంభం అవుతుందియూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం-రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్స్ అంచనాల ప్రకారం, ఈసారి నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే పలకరించే అవకాశం ఉందని తెలుస్తోంది. మే చివరి నాటికే దక్షిణ భారతదేశంలో వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. మే 18 నుండి 25 మధ్య నైరుతి రుతుపవనాలు అండమాన్ మరియు నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో సాధారణం కంటే 30 నుండి 60 మి.మీ ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని అంచనాగా వెల్లడించారు. రుతుపవనాలు ముందే రావటం ద్వారా ఎండలతో అల్లాడుతున్న వేళ ఉపశమనం లభించనుంది. జూన్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు ఈసారి నాలుగు నెలల్లో వ‌ర్షపాతం నార్మ‌ల్ స్థాయి క‌న్నా ఎక్కువే ఉంటుంద‌ని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు