BREAKING
పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం SBI ATM విత్‌డ్రాయల్‌ రూల్స్‌లో మార్పులు కాగిత రామచంద్రపురం గ్రామంలో అంగరంగ వైభవంగా బోనాల పండుగ
Date of Publish : 04 June 2026, 02:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటుకు రెండేళ్లు పూర్తి – రెడ్డిగూడెంలో భారీ నిరసన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 02:46 PM
178 వీక్షణలు

మోసపూరిత హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి, ఇప్పుడు వెన్నుపోటు రాజకీయాలు కొనసాగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

ఎన్టీఆర్ జిల్లా (రెడ్డిగూడెం మండలం)

 రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన సందర్భంగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో తీవ్ర నిరసన కార్యక్రమం జరిగింది.

 మాజీ మంత్రి జోగి రమేష్ ఆదేశాల మేరకు, రెడ్డిగూడెం మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

మెయిన్ సెంటర్‌లో ర్యాలీ – కూటమి ప్రభుత్వంపై నినాదాలు

రెడ్డిగూడెం మెయిన్ సెంటర్‌లో భారీ ర్యాలీ నిర్వహించి, కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగుతోందని ఆరోపిస్తూ నినాదాలు హోరెత్తాయి.

 “మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు”

 “ప్రజల ఆశలను వంచించారు”

 “అసమర్థ పాలన కొనసాగుతోంది”

అని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేనిఫెస్టో దహనం – తీవ్ర నిరసన

కూటమి ప్రభుత్వ మేనిఫెస్టో ప్రతులను దహనం చేస్తూ నాయకులు, కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తం చేశారు.

ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలతో రెడ్డిగూడెం ప్రాంతం ఉద్రిక్త వాతావరణాన్ని తలపించింది.

 స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

రాజకీయ వేడి పెంచిన “రెండేళ్ల” కార్యక్రమం

కూటమి ప్రభుత్వ పాలనపై అసంతృప్తి, వైఫల్యాల ఆరోపణలతో ఈ కార్యక్రమం జిల్లాలో రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.