BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 28 August 2026, 02:42 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండ జెడ్పీహెచ్‌ఎస్‌లో రూ.21 లక్షలతో భోజనశాల నిర్మాణం.. వేగా జువెల్లరీ దాతృత్వానికి అభినందనలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 02:42 PM
217 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వేగా జువెల్లరీ యాజమాన్యం కేశవరావు కుమారుల వితరణతో సుమారు రూ.21 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన భోజనశాలను ప్రారంభించారు 

ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు మాసగిరి శ్రీనివాస్, బ్రహ్మాచారి లు ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన భోజనశాలను ప్రారంభించారు. అనంతరం మండల విద్యాశాఖ అధికారులు మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యం కోసం ఇంత పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి భోజనశాలను నిర్మించిన వేగా జువెల్లరీ యాజమాన్యానికి మండల విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని, సమాజ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న వేగా జువెల్లరీ సేవలు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థుల కోసం భోజనశాలను నిర్మించడం గొప్ప సేవా కార్యక్రమమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా దాతలు సహకరించడం అభినందనీయమని కొనియాడారు.

అనంతరం వేగా జువెల్లరీ ప్రతినిధులను ఘనంగా సన్మానించి నూతన వస్త్రాలను బహుకరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీపీ కందుల కృష్ణ మాట్లాడుతూ “జీవితం కరిగిపోయే మంచు వంటిది.. ఉన్నదాంట్లో నలుగురికి పంచాలి” అనే ఆర్యోక్తిని ఆచరిస్తూ సమాజ సేవలో ముందుంటున్న వేగా జువెల్లరీ సేవలను ప్రశంసించారు.