BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం
Date of Publish : 01 September 2026, 02:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ.. సంక్షేమ పథకాలతో ప్రజలకు ఆర్థిక భరోసా: నక్కా రాము

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Sep, 2026 - 02:52 PM
142 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా చాట్రాయి మండలం చనుబండలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నక్కా రాము మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తూ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకులా అండగా నిలుస్తోందన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులు, కిడ్నీ బాధితులు గౌరవంగా జీవించేలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఉపయోగపడుతున్నాయని తెలిపారు.

సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రభుత్వం ముందుందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నూజివీడు నియోజకవర్గ ఎమ్మెల్యే, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.

ప్రజలు తమ సమస్యలపై సంప్రదించిన వెంటనే స్పందిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందరికీ చేరేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం కొనసాగేందుకు రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకుడు బన్నీ వీరస్వామి పాల్గొన్నారు.