BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 07 August 2026, 05:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చనుబండలో రైతులకు ఎల్నినో నివారణ చర్యలపై విఏఏ నాగమణి అవగాహన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Aug, 2026 - 05:02 PM
131 వీక్షణలు

చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామ రైతు సేవా కేంద్రంలో రైతులకు ఎల్నినో ప్రభావ నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామసభను వీఏఏ నాగమణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎల్నినో ప్రభావ నివారణ కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో చేపడుతున్న ప్రత్యేక ప్రచార కార్యక్రమంలో భాగంగా రైతులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా రైతులు తమ పొలాలను క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవాలని, ప్రస్తుత పంట పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని, బీడు భూముల్లో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడంతో పాటు అంతర పంటల విధానాన్ని అవలంబించాలని అవగాహన కల్పించారు.

అలాగే ఏపీ ఏఐఎంఎస్‌ 2.0 ద్వారా వ్యవసాయ కార్యకలాపాల పారదర్శక పర్యవేక్షణ, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, పీఎండీఎస్‌ అమలులో రైతులు సూచనలు పాటించడం వంటి అంశాలను వివరించారు. వాతావరణ పరిస్థితుల్లో మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల యాజమాన్య పద్ధతులను పాటించాలని తెలిపారు.

ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడంతో పాటు తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. పంటల్లో తెగుళ్లు, పురుగుల ఉద్ధృతి కనిపిస్తే వెంటనే రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించి వ్యవసాయ శాఖ సలహాలు పొందాలని సూచించారు.

కార్యక్రమంలో నీటి సంఘం అధ్యక్షులు బి. రమేష్, కె. రమేష్, జి. వెంకటేశ్వరరావు, రైతు సేవా కేంద్రం సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.