BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 08 August 2025, 06:48 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మంత్రి నారా లోకేష్ చొరవతో స్వగ్రామానికి చందు

తెలంగాణ
08 Aug, 2025 - 06:48 AM
523 వీక్షణలు
మంత్రి నారా లోకేష్ చొరవతో స్వగ్రామానికి చందు NTODAY NEWS: మంగళగిరి -కాంబోడియా నుంచి క్షేమంగా ఇంటికి చేరిక -మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు. ఉద్యోగం కోసం కాంబోడియా వెళ్లి కష్టాల్లో చిక్కుకున్న మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి పెనుమాక గ్రామానికి చెందిన వేమవరపు చందు... రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ చొరవతో విముక్తి లభించింది. గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి -నగరపాలక సంస్థ పరిధి పెనుమాక కు చెందిన వేమవరపు చందు ఇంటర్ వరకూ చదివి కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో విజయవాడలో క్యాటరింగ్ నిర్వహించుకుంటూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలల క్రితం వింజనంపాడులో జరిగిన తన సోదరి వివాహ కార్యక్రమంలో పర్చూరుకు చెందిన మోజెస్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అతని మాటలు నమ్మిన మధు ఈ ఏడాది జూన్ 24వ తేదీన ఉద్యోగం కోసం కాంబోడియా వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తరువాత అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు. చందును సైబర్ క్రైమ్స్ చేయాలంటూ మోజెస్, అతని ముఠా సభ్యులు వేధింపులు చేయడం ప్రారంభించారు. దీనికి చందు అంగీకరించకపోవడంతో చీకటి గదిలో బంధించి తిండి కూడా సరిగా పెట్టకుండా చిత్రహింసలకు గురి చేశారు.‌ దీనికి తోడు అక్కడి వాతావరణ పరిస్థితులకు యువకుడు చందుకు గొంతు నుంచి గుండె వరకూ ఇన్ఫెక్షన్ అయింది. ఎలాగైనా సైబర్ ముఠా చెర నుంచి బయటపడాలనే ఆలోచనలో ఉన్న చందు హలో డాట్ నారా లోకేష్ కు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించాడు. స్పందించిన మంత్రి లోకేష్ యువకుడు చందును క్షేమంగా స్వస్థలానికి చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి లోకేష్ ఆదేశాలతో కాంబోడియా ఎంబసీ అధికారులతో మాట్లాడిన వారు యువకుడు మధును ఈనెల ఒకటవ తేదీన క్షేమంగా స్వస్థలానికి చేరేలా చర్యలు తీసుకున్నారు. కాగా తనను సైబర్ నేరగాళ్ల చెర నుంచి ప్రాణాలతో కాపాడిన మంత్రి నారా లోకేష్ కు యువకుడు మధు, కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. Follow us on Website Facebook Instagram YouTube