BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

చుక్కల భూములకు విముక్తి.. 10-15 రోజుల్లో కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 06:06 PM
114 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో చుక్కల భూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. మరో 10 నుంచి 15 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 1.90 లక్షల ఎకరాల చుక్కల భూములకు విముక్తి కల్పించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు.

రెవెన్యూ రికార్డుల్లో యజమాని వివరాల స్థానంలో చుక్కలు నమోదు చేయబడిన భూములను చుక్కల భూములుగా పిలుస్తారు. ఈ భూములు ప్రభుత్వానివా, వ్యక్తిగత యాజమాన్యానికి చెందినవా అన్న స్పష్టత లేకపోవడంతో వివాదాస్పద భూములుగా గుర్తించి నిషేధిత జాబితాలో చేర్చారు. దీంతో వేలాది మంది భూ యజమానులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ప్రజల ఆస్తులకు పూర్తి భద్రత కల్పించడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. భూములు, రిజిస్ట్రేషన్లు, రీసర్వేకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించామని వెల్లడించారు.

రీసర్వే 2.0 కార్యక్రమం ద్వారా భూ యజమానులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేస్తున్నామని, ఇప్పటికే 1.33 లక్షల ఎకరాల గ్రామ సర్వీస్ ఇనాం భూములకు విముక్తి కల్పించామని తెలిపారు. ఫ్రీహోల్డ్ భూముల సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని, 22ఏ అంశంపై గతంలో జారీ చేసిన మెమో కంటే మెరుగైన మార్గదర్శకాలు తీసుకురానున్నట్లు చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన రీసర్వేపై రాష్ట్రవ్యాప్తంగా 7.5 లక్షల ఫిర్యాదులు అందాయని మంత్రి వెల్లడించారు. అందుకే రీసర్వే అనంతరం భూహక్కుదారుల ఈ-కేవైసీ తీసుకుని రాజముద్ర, ఫోటో, ఖాతా నంబర్, క్యూఆర్ కోడ్‌తో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నామని తెలిపారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామని, కేవలం 10 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసేలా వ్యవస్థను రూపొందించామని చెప్పారు. తప్పుడు రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చామని, గతంలో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్లను కూడా రద్దు చేసే అధికారాలపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ పెంచే ప్రతిపాదన ప్రస్తుతం లేదని స్పష్టం చేసిన మంత్రి, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పరిశ్రమలకు అనుకూల విధానాలు అమలు చేస్తున్నామని తెలిపారు. దీంతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు.