రామకృష్ణాపూర్, కంఠాత్మకూర్ గ్రామాల్లో కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటన
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
హనుమకొండ జిల్లా, నడికూడ:
నడికూడ మండలంలోని రామకృష్ణాపూర్, కంఠాత్మకూర్ గ్రామాల్లో జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గ్రామాల్లో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు.
పర్యటనలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రం, భవిత కేంద్రం, జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి అక్కడ అందుతున్న సేవలు, కార్యక్రమాల అమలుపై వివరాలు తెలుసుకున్నారు.
అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు అందుతున్న సేవలు, మౌలిక వసతులను పరిశీలించారు. భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు అందుతున్న సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, పాఠశాలలోని మౌలిక వసతులను పరిశీలించారు. గ్రామాల్లో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రజలకు సక్రమంగా అందేలా సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.