BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 16 February 2026, 09:48 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ధర్మపురి మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ పట్టు

తెలంగాణ
16 Feb, 2026 - 09:48 AM
257 వీక్షణలు
ధర్మపురి మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ పట్టు: చైర్మన్‌గా వేముల నాగలక్ష్మి NTODAY NEWS: ధర్మపురి,(గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ) ధర్మపురి మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే జరిగిందని రాష్ట్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సోమవారం జరిగిన ప్రత్యేక సమావేశానికి హాజరైన మంత్రి, నూతన పాలకవర్గ వివరాలను ప్రకటించారు. పదవుల పంపకం ఇలా: మున్సిపల్ చైర్మన్ (మొదటి 2 ఏళ్లు): వేముల నాగలక్ష్మి తదుపరి చైర్మన్ (మిగిలిన 3 ఏళ్లు): సంఘనభట్ల సంతోషి వైస్ చైర్మన్: ఇందారపు రామన్న చైర్మన్ పదవికి పోటీ పడిన సంఘనభట్ల దినేష్ సంతోషికి రాష్ట్ర స్థాయి పదవి ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ నిర్ణయం మేరకే ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. విజయోత్సవాలపై స్పష్టత ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ, వెంటనే సంబరాలు జరపవద్దని మంత్రి సూచించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను 60 రోజుల్లో అమలు చేసిన అనంతరం మాత్రమే అధికారిక విజయోత్సవాలు నిర్వహించాలని తెలిపారు. అప్పటివరకు కౌన్సిలర్లు తమ వార్డుల్లో పర్యటించి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేయాలని సూచించారు. #Dharmapuri #CongressParty #MunicipalElections #VemulaNagalakshmi #TelanganaPolitics #CivicGovernance Follow us on Website Facebook Instagram YouTube