BREAKING
thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ
Date of Publish : 15 September 2026, 01:34 pm
Posted by : DAVU RAVINDER REDDY

పీర్జాపూర్‌లో గణేశుడి విగ్రహం ఏర్పాటుపై వివాదం.. చెరువులో నిమజ్జనం

తెలంగాణ
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
15 Sep, 2026 - 01:34 PM
1 వీక్షణలు

రంగారెడ్డి / Ntoday News: రంగారెడ్డి జిల్లా పీర్జాపూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో గణేష్ విగ్రహం ఏర్పాటు విషయంలో రెండు వర్గాల మధ్య వివాదం చోటుచేసుకుంది. కొందరు గ్రామస్తులు ఆలయంలో గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని భావించి పెద్ద విగ్రహాన్ని తీసుకురావడంతో వివాదం ప్రారంభమైంది.

అయితే మరో వర్గం ఇప్పటికే తాము ఏర్పాటు చేసిన గణేశుడి విగ్రహాన్నే ఆలయంలో ఉంచాలని పట్టుబట్టినట్లు సమాచారం. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

సమాచారం అందుకున్న చౌదరిగూడ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఆలయంలో గణేష్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి లేదని, విగ్రహాన్ని మరోచోట ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం.

పోలీసుల సూచనపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఒక వర్గం.. తాము తీసుకొచ్చిన గణేష్ విగ్రహాన్ని గ్రామ చెరువులో నిమజ్జనం చేసినట్లు తెలుస్తోంది. ఘటన నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.