BREAKING
thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ
Date of Publish : 15 September 2026, 01:36 pm
Posted by : DAVU RAVINDER REDDY

మౌలాలి వద్ద ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌పై తెగిపడిన విద్యుత్ తీగలు.. తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
15 Sep, 2026 - 01:36 PM
1 వీక్షణలు

హైదరాబాద్ / Ntoday News: హైదరాబాద్‌లోని మౌలాలి సమీపంలో విజయవాడ–సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు సోమవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న రైలు మౌలాలి సమీపానికి చేరుకునే సమయంలో ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలు అకస్మాత్తుగా తెగి రైలు ఇంజిన్, బోగీలపై పడటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

విద్యుత్ తీగలు రైలుపై పడిన సమయంలో భారీ శబ్దాలు వినిపించడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో కొందరు ప్రయాణికులు రైలు నుంచి కిందికి దిగి పరుగులు తీశారు. అయితే పరిస్థితిని గమనించిన లోకో పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే రైలును నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు సమాచారం.

ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే, విద్యుత్ శాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రాథమికంగా సాంకేతిక లోపం కారణంగానే ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలు తెగిపడినట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం.

అధికారులు విద్యుత్ తీగలను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. అనంతరం రైలు రాకపోకలను పునరుద్ధరించి, ప్రయాణికులను అదే రైలులో సికింద్రాబాద్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. ఘటనతో కొంతసేపు రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.