రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్.. ఇంటి నుంచే e-KYC పూర్తి చేసుకోవచ్చు
హైదరాబాద్ / Ntoday News: రేషన్ కార్డుదారులు e-KYC కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని DCSO వనజాత తెలిపారు. ‘Mera Ration App’ ద్వారా ఇంటి నుంచే e-KYC ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని వెల్లడించారు.
రేషన్ కార్డుదారులు తమ మొబైల్ ఫోన్ నంబర్, ఆధార్ వివరాలను నమోదు చేసి OTP ధ్రువీకరణ అనంతరం ఫేస్ రికగ్నిషన్ ప్రక్రియను పూర్తి చేస్తే e-KYC పూర్తవుతుందని తెలిపారు. ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన వెంటనే సంబంధిత మొబైల్ నంబర్‌కు మెసేజ్ వస్తుందని పేర్కొన్నారు.
రేషన్ కార్డులో సభ్యుడిగా కొనసాగేందుకు e-KYC పూర్తి చేయడం తప్పనిసరి అని DCSO తెలిపారు. రేషన్ కార్డుదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో e-KYC ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
అయితే 5 సంవత్సరాల లోపు పిల్లలకు ప్రస్తుతం e-KYC అవసరం లేదని, వారు 6 సంవత్సరాలు పూర్తిచేసుకున్న తర్వాత రేషన్ షాపు వద్ద వేలిముద్ర ద్వారా e-KYC చేయించుకోవచ్చని తెలిపారు.