BREAKING
thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ
Date of Publish : 15 September 2026, 01:40 pm
Posted by : DAVU RAVINDER REDDY

తిరుమలలో నేటి నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

భక్తి
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
15 Sep, 2026 - 01:40 PM
1 వీక్షణలు

తిరుమల / Ntoday News: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వైభవంగా ప్రారంభం కానున్నాయి. సాయంత్రం అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజస్తంభంపై గరుడ పతాకాన్ని ఎగురవేయడంతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం మలయప్పస్వామి సమక్షంలో సకల దేవతలు, అష్టదిక్పాలకులను ఆహ్వానించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలి రోజు రాత్రి 9 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి పెద్దశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. స్వామివారి వాహన సేవలను వీక్షించేందుకు దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలిరానున్నారు.

మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఈ సందర్భంగా తిరుమలలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.

తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో శ్రీవారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొత్తం 16 వాహన సేవలతో తిరుమలలో ఆధ్యాత్మిక సందడి నెలకొననుంది. బ్రహ్మోత్సవాలను భక్తులు భక్తిశ్రద్ధలతో వీక్షించేలా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.