తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
దేశ శ్రేయస్సు కోసం ప్రార్థించానన్న యోగి.. వెంట ఏపీ మంత్రులు
తిరుమల | Ntoday News
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని, స్వామివారిని దర్శించుకుని దేశ శ్రేయస్సు కోసం ప్రార్థించినట్లు యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.
స్వామివారి దర్శనం అనంతరం ఆలయ విశేషాలను, తన పర్యటనకు సంబంధించిన ఫొటోలను యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘ఓం నమో వేంకటేశాయ’ అని పేర్కొన్నారు.
యోగి ఆదిత్యనాథ్ వెంట ఏపీ మంత్రులు సత్యకుమార్ యాదవ్, నారాయణ తదితరులు ఉన్నారు.
అంతకుముందు నెల్లూరు జిల్లాలోని స్వర్ణభారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. అనంతరం తిరుమలకు చేరుకుని శ్రీవారి దర్శనం చేసుకున్నారు.