BREAKING
thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన
Date of Publish : 02 September 2026, 01:15 pm
Posted by : DAVU RAVINDER REDDY

తిరుమల వెళ్తున్నారా? ఒక్క రోజు టోకెన్లు రద్దు!

భక్తి
02 Sep, 2026 - 01:15 PM
70 వీక్షణలు

తిరుమల వెళ్తున్నారా? ఒక్క రోజు టోకెన్లు రద్దు!

Tirumala News: తిరుమలలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. భక్తుల కోలాహలంతో కలియుగ వైకుంఠం కిటకిటలాడుతోంది. శ్రీవారి దివ్యదర్శనం కోసం పరితపించే భక్తులకు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ముఖ్యమైన సమాచారం అందించింది. భక్తుల రద్దీ నియంత్రణ, ఇతర ప్రత్యేక ఏర్పాట్ల నిమిత్తం తిరుపతిలోని మూడు కేంద్రాల వద్ద జారీ చేసే ఎస్ఎస్ఓ టోకెన్లను బుధవారం ఒక్కరోజు రద్దు చేశారు.

శుక్రవారం శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్ఓ టోకెన్ల జారీ ప్రక్రియ గురువారం నుంచి యథావిధిగా ప్రారంభమవుతుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే గత పది వారాలుగా వరుసగా టోకెన్ల రద్దు నిర్ణయాలుఅమలవుతుండటంతో వివిధ సుదూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చే సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోకెన్లు లభించక గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ తరుణంలో భక్తుల రద్దీ మరింత విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత సెప్టెంబర్ మాసంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశ విదేశాల నుంచి వచ్చే వేలాది మంది భక్తులతో తిరుమల కిక్కిరిసిపోయే పరిస్థితి కనిపిస్తోంది. బ్రహ్మోత్సవాల వేళ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు టీటీడీ అధికారులు ముందస్తు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.

గడచిన ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారిని మొత్తం 24.56 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.137.44 కోట్లు లభించింది. ఏటా మాదిరిగానే ఈసారి కూడా భక్తుల నుంచి భారీ స్పందన లభించడం విశేషం.

బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న వేళ రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులు తమ ప్రయాణ ఏర్పాట్లను ముందస్తుగా చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. టోకెన్ల జారీ విధానంపై ఎప్పటికప్పుడు వచ్చే అధికారిక ప్రకటనలను గమనించాలని కోరుతున్నారు. స్వామివారి సేవలో తరించేందుకు విచ్చేసే ప్రతి ఒక్కరికీ మెరుగైన వసతి, ప్రసాద వితరణ అందేలా అన్ని విభాగాల సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. ఇకపోతే ఈసారి తిరుమలలో రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. అధిక మాసం కారణం. అందువల్ల ఈ నెలలో, అక్టోబర్ నెలలో తిరుమల వెళ్లాలని భావించే భక్తులు ఈవిషయాన్ని గుర్తించుకోవాలి.