దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి
దేవరపల్లిలో వై యస్ జగన్ పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఈ రోజు జరిగిన పొగాకు రైతుల పరామర్శ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలో ఉన్న సమయంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ రైతుల పక్షాన నిరంతరం పోరాడుతున్నారని అన్నారు.
పొగాకు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, స్వయంగా రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని, వారికి అండగా నిలుస్తానని భరోసా ఇవ్వడం ప్రజా నాయకుడి నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు.
రైతు కష్టాన్ని తన కష్టంగా భావించి, వారి హక్కుల కోసం ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్న నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని అన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, రైతుల ప్రయోజనాల కోసం అవసరమైన ప్రతి వేదికపై పోరాటం కొనసాగిస్తామని చిర్ల జగ్గిరెడ్డి స్పష్టం చేశారు.