BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 07 August 2026, 05:02 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలి తిరువూరులో వైసీపీ రెండో రోజు నిరాహార దీక్షలు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Aug, 2026 - 05:02 PM
51 వీక్షణలు

తిరువూరు: డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తిరువూరులో చేపట్టిన నిరాహార దీక్షలు శుక్రవారం రెండో రోజుకు కొనసాగాయి.

తిరువూరులో ఏర్పాటు చేసిన దీక్ష శిబిరంలో వైసీపీ లీగల్ సెల్‌కు చెందిన న్యాయవాదులు పాల్గొని దీక్షలకు సంఘీభావం తెలిపారు. డీఎస్సీ నియామక ప్రక్రియపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.

నిరుద్యోగులు, అభ్యర్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని డీఎస్సీ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. ఆరోపణలకు సంబంధించి నిజానిజాలు తేల్చేందుకు సీబీఐ విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.

దీక్ష శిబిరానికి తిరువూరు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి మద్దతు తెలిపారు. డీఎస్సీ వ్యవహారంపై తమ ఆందోళనను కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.