BREAKING
తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష కశిoకోట RECS పాలిటెక్నిక్ కళశాల టీచర్లు రేలే నిరాహార దీక్ష సెప్టెంబర్ 1.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో చిరస్మరణీయమైన రోజు కాగిత రామచంద్రపురం గ్రామ ప్రభుత్వ ఉపాధ్యాయుడికి హానరరీ డాక్టర్ ప్రధానం వాహనాలు తనిఖీలు జరిమానా విధింపు 2టౌన్ ఎస్సై గా బాధ్యతలు స్వీకరణ
Date of Publish : 19 April 2026, 02:53 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
19 Apr, 2026 - 02:53 PM
122 వీక్షణలు

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు విజయవంతంగా సర్జరీ

ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం చంద్రబాబు

పవన్ క్షేమంగా ఉన్నారంటూ జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రకటన

వారం నుంచి 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు

అధికారిక సమావేశంలో అస్వస్థతకు గురవడంతో ఆసుపత్రిలో చేరిక

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. "పవన్ కల్యాణ్ గారు శస్త్రచికిత్స అనంతరం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన త్వరగా శక్తిని పుంజుకుని, మునుపటి కంటే ఆరోగ్యంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన త్వరగా విధుల్లోకి తిరిగి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

పవన్ సోదరుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా ఈ విషయంపై స్పందించారు. "మన ప్రియతమ నాయకుడు పవన్ కల్యాణ్‌కు వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఆయన క్షేమంగా, ఆరోగ్యంగా కోలుకుంటున్నారు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని, త్వరలోనే నూతన శక్తితో తిరిగి వస్తారు. ఆయన దృఢత్వమే మనకు స్ఫూర్తి, ఆయన ఆరోగ్యమే మన ఆనందం" అని నాగబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

శుక్రవారం నాడు అధికారిక కార్యక్రమాల్లో భాగంగా అధికారులతో చర్చిస్తుండగా పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఎమ్ఆర్‌ఐ స్కాన్‌తో పాటు పలు పరీక్షలు నిర్వహించి, శస్త్రచికిత్స అవసరమని సూచించారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఆయనకు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, 7 నుంచి 10 రోజుల వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు జనసేన పార్టీ రాజకీయ కార్యదర్శి పి. హరి ప్రసాద్ తెలిపారు. అయితే, పవన్‌కు ఎదురైన అనారోగ్య సమస్య ఏంటి, ఏ రకమైన శస్త్రచికిత్స చేశారనే వివరాలను పార్టీ వర్గాలు వెల్లడించలేదు.