BREAKING
శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష
Date of Publish : 20 April 2026, 08:45 am
Posted by : ఇప్పలపల్లి నరేందర్

దళితుల వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / తుర్కపల్లి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
20 Apr, 2026 - 08:45 AM
148 వీక్షణలు

దళితుల వార్డులలో డ్రైనేజీ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలి --సిపిఎం మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ డిమాండ్

సిపిఎం పార్టీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా, తుర్కపల్లి మండల కేంద్రంలోని 6వ,7వ దళిత బిసి వార్డులను సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలన చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పోతరాజు జహంగీర్ మాట్లాడుతూ దాదాపు 20 సంవత్సరాలు సిసి రోడ్లు నిర్మాణం చేసి మోరీలను మరిచిన ప్రభుత్వాలు స్థానిక ప్రజా ప్రతినిధులు అని అన్నారు ప్రతి ఇంటి నుండి వేస్టేజ్ నీరు రోడ్లపైకి రావడం తోటి ఒంపుగా ఉన్న ఇండ్లలోకి నీరు వచ్చి చేరడం తోటి ఈ కాలనీ ప్రజలు ప్రతిరోజు ఇబ్బందులకు గురవుతున్నారని దీనివలన సీజనల్ అంటువ్యాధు లు వచ్చే ప్రమాదం ఉందని పైన ఉన్న ఇరువురు ఇండ్ల వారితో దిగువన ఉన్న ఇండ్లవారు రోజు మాటల యుద్ధమే జరుగుతుందని మాది దళితవాడ అయినందునే మమ్ముల పట్టించుకునే ప్రభుత్వాలు స్థానిక ప్రజా ప్రతినిధులు కరువయ్యారని గతంలో ఎన్నిసార్లు ఎమ్మార్వోకి,ఎంపీడీవోకి, పంచాయతీ కార్యదర్శులకు వినతి పత్రాలు అందజేశామని తమ బాధను వెలిబుచ్చుకున్నారని అన్నారు వెంటనే ప్రభుత్వం, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసి కాలనీ ప్రజల సమస్యలను పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కొక్కొండ లింగయ్య, తలారి మాతయ్య, గడ్డమీది నరసింహ, ఆవుల కలమ్మ, నాయకులు బిచ్చాల సంతోష్, ఆవుల మహేష్, తలారి భాను, కాలనీవాసులు అంజమ్మ, భారతమ్మ, లక్ష్మి, జయమ్మ, నరసమ్మ, మాధవి, సుగుణమ్మ, బాలమణి తదితరులు పాల్గొన్నారు