BREAKING
thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్ thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● దిల్సుఖ్‌నగర్‌ సాయిబాబా ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు thumb ● డంపింగ్ యార్డ్ దుర్వాసన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తా thumb ● ఎన్‌ఐటీ వరంగల్‌–సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాల మధ్య ఎంఓయూ thumb ● డాన్ బాస్కో పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● శోభనాద్రిపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు thumb ● పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహణ thumb ● రామన్నపేట మండల వార్డు మెంబర్ల పోరం అధ్యక్షుడిగా అబ్దుల్ వహీద్ అంజద్
Date of Publish : 24 May 2026, 06:07 pm
Posted by : V శ్రీనివాస్

​దండేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో విషాదం: వడదెబ్బతో రికార్డు అసిస్టెంట్ నరేష్ మృతి

తెలంగాణ
/ మంచిర్యాల / దండేపల్లి
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
24 May, 2026 - 06:07 PM
155 వీక్షణలు

​మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత.. సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి

​మంచిర్యాల జిల్లా దండేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నరేష్ ఆదివారం వడదెబ్బతో అకాల మరణం చెందారు. జన్నారం మండలం బాదంపెల్లి గ్రామానికి చెందిన ఆయన తీవ్రమైన ఎండల కారణంగా అస్వస్థతకు గురికావడంతో, కుటుంబ సభ్యులు వెంటనే మంచిర్యాల ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. ఈ విషాదకర సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

​నరేష్ అకాల మరణం పట్ల దండేపల్లి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది మరియు సహోద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపం వ్యక్తం చేశారు. ఈ సంఘటన వేసవి కాలంలో వడదెబ్బ తీవ్రతపై ప్రజల్లో మరోసారి ఆందోళన రేకెత్తించింది. ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.