BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 08 April 2026, 05:40 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

డ్రగ్స్ పై దండయాత్ర 2.0

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Apr, 2026 - 05:40 AM
167 వీక్షణలు

డ్రగ్స్ పై దండయాత్ర 2.0 – అవగాహన తరువాత కార్యాచరణ

విజయవాడ, 8 ఏప్రిల్ 2026:

ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో, జీరో టాలరెన్స్ టూ డ్రగ్స్ లక్ష్యంతో, డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమం శక్తివంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా, నార్త్ డివిజన్ పరిధిలో నిన్న రాత్రి విస్తృత తనిఖీలు చేపట్టారు.

74 మంది అనుమానితుల తనిఖీ, 22 మందికి మత్తు పదార్ధాల అలవాటు

పోలీసులు 74 మంది అనుమానితులను తనిఖీ చేయగా, 22 మందిని మత్తు పదార్ధాల అలవాటు ఉన్నట్లు గుర్తించారు. వీరిని డీ అడిక్షన్ సెంటర్ కు తరలించి, కౌన్సిలింగ్ ఇవ్వబడింది.

పోలీసులు 149 హాట్ స్పాట్స్‌ను గుర్తించారు. ఈ 149 హాట్ స్పాట్స్ లో 30 రోజులపాటు 3000 డ్రగ్స్ టెస్ట్ కిట్స్ ద్వారా, రోజుకు 100 మంది అనుమానితులను పరీక్షించే ఏర్పాట్లు చేయబడినాయి. పాజిటివ్ వచ్చిన వారిని కౌన్సిలింగ్ సెంటర్లకు తరలించి, శిక్షణ పొందించాలని తగిన చర్యలు తీసుకుంటారు.

సత్యనారాయణ పురం ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, అజిత్ సింగ్ నగర్ ఇన్స్పెక్టర్ చంద్ర శేఖర రావు, నున్న ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్, ఆకాష్ ఫౌండేషన్, మెడికల్ అధికారులు, సబ్ డివిజన్ ఎస్.ఐ.లు పాల్గొన్నారు.

సమాజ శ్రేయస్సుకు కట్టుబడిన భగీరథ ప్రయత్నం

ఈ చర్యలు, యువతను మత్తు పదార్ధాల నుండి దూరం చేసి, సమాజ శ్రేయస్సుకు ప్రేరణ అయ్యేందుకు పోలీస్ కమిషనరేట్ గట్టి సంకల్పంతో ముందడుగు వేస్తోంది.