BREAKING
వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు వంగవీటి మోహన్ రంగా ఆశయ సాధనకు కృషి చేయాలి .ఎం ఎల్ ఏ సుజన చౌదరి.. నల్గొండ: దొడ్డి కొమురయ్యకు డివైఎఫ్ఐ–ఎస్ఎఫ్ఐ ఘన నివాళులు దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీక అల్లూరి సీతారామరాజు – బొండా ఉమా పర్యావరణ పరిరక్షణపై అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా విద్యాశాఖాధికారి ఆధార్ యాప్‌లోనే వివరాలు అప్‌డేట్ వాట్సాప్‌లో ఈ లింక్స్‌పై అస్సలు క్లిక్ చేయొద్దు 32 టన్నుల ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) రేషన్ బియ్యం స్వాధీనం – ఐదుగురు నిందితుల అరెస్ట్ ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్ - ఇకపై ఆ 3వేలు కట్టక్కర్లేదు బాచుపల్లిలో డ్వాక్రా మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ.. కొలను హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు డీసీసీ ఉపాధ్యక్షుడు కూన శ్రీనివాస్ గౌడ్‌ను కలిసిన నూతన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు
www.ntodaynews.com

దత్తా త్రేయ స్వామికి ప్రత్యేక పూజలు

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
02 Apr, 2026 - 10:55 PM
168 వీక్షణలు

దత్తా త్రేయ స్వామికి ప్రత్యేక పూజలు 

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 

  తేది:  02.04.2026

లోకకల్యాణంకోసం దేవస్థానం గురువారం (02.04.2026) ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద నెలకొని ఉన్న శ్రీ దత్తాత్రేయస్వామివారికి విశేషపూజలను నిర్వహించింది.

ప్రతి గురువారం దేవస్థానసేవగా (సర్కారీసేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది.

ఈ పూజాకార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతి పూజను జరిపించబడింది. ఆ తరువాత దత్తాత్రేయస్వామివారికి పంచామృతాభిషేకం, విశేషపూజలు నిర్వహించబడ్డాయి.  

లోకోద్ధరణకోసమై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే స్వరూపములో దత్తాత్రేయునిగా అవతరించారు. అందుకే త్రిమూర్తి స్వరూపునిగా దత్తాత్రేయుడు ప్రసిద్ధుడు.

కాగా శ్రీశైలక్షేత్రానికి దత్తాత్రేయుల వారికి ఎంతో దగ్గర సంబంధం ఉంది. 

ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం క్రింద దత్తాత్రేయులవారు తపస్సు చేశారని ప్రతీతి. అందుకే   ఈ వృక్షానికి దత్తాత్రేయ వృక్షమని పేరు. 

కాగా దత్తాత్రేయస్వామివారు కలియుగంలో గోదావరితీరాన పిఠాపురంలో శ్రీపాదవల్లభునిగా జన్మించారు. వీరు ఒకసారి శ్రీశైలక్షేత్రంలోనే చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించినట్లుగా గురుచరిత్రలో చెప్పబడింది. 

కాగా శ్రీపాదవల్లభుడు తమ శిష్యులకు ఆయా తీర్థక్షేత్రాల మహిమావిశేషాలను పేర్కొనే సందర్భంలో కూడా శ్రీశైలాన్ని పలుసార్లు ప్రస్తావించారు. 

శ్రీ పాదవల్లభుల జన్మ తరువాత మహారాష్ట్రలోని కరంజినగరములో నృసింహసరస్వతి స్వామిగా దత్తాత్రేయస్వామి వారు జన్మించారు. వీరు ఒకసారి మహాశివరాత్రి రోజున శ్రీశైలమల్లికార్జునుని సేవించినట్లుగా కూడా గురుచరిత్ర చెబుతోంది. 

నృసింహసరస్వతి వారు తమ అవతార సమాప్తిని శ్రీశైలంలోని పాతాళగంగలోనే చేశారు. కలియుగ ప్రభావం రోజు రోజుకు ఎక్కువకావడముతో, నృసింహసరస్వతీస్వామి అదృశ్య రూపములో ఉండి తన భక్తులను రక్షించాలని నిర్ణయించారు. దాంతో భౌతికదేహాన్ని త్యజించేందుకు నలుగురు శిష్యులతో కలిసి శ్రీశైలానికి వచ్చారు. 

శ్రీశైలంలోని కదళీవనం దగ్గర తమ శిష్యులు చూస్తుండగానే నృసింహసరస్వతి స్వామివారు అరటి ఆకులతో చేసిన ఒక ఆసనంపై కూర్చోని, కృష్ణానదిలో ప్రవేశించి, కొంతదూరం ఆ అరటిఆకులపైనే పయనిస్తూ, అదృశ్యమైనట్లు గురుచరిత్ర చెబుతోంది. 

( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)

శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ