BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 04 February 2026, 10:31 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం

తెలంగాణ
04 Feb, 2026 - 10:31 AM
318 వీక్షణలు
కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం చిట్యాల 11వ వార్డులో సందీప రామ్ రెడ్డి ముమ్మర ప్రచారం NTODAY NEWS: చిట్యాల నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొబ్బలి సందీప రామ్ రెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శివాలయం పరిసర ప్రాంతాల్లో ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలుసుకుని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమం, అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా పాలన సాగుతోందన్నారు. అదే విధంగా చిట్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే వార్డు అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. 11వ వార్డులో డ్రైనేజీ, రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరిస్తామని తెలిపారు. నాయకుడిగా కాకుండా ప్రజల మధ్య ఉండే సేవకుడిగా పనిచేస్తూ, ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం అందించేలా కృషి చేస్తానని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఇతర పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, యువజన విభాగం సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. #Chityal #MunicipalElections #CongressParty #ElectionCampaign #UrbanDevelopment #LocalGovernance #TelanganaPolitics Follow us on Website Facebook Instagram YouTube