BREAKING
హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ గుంటూరు : ఈ వ్యక్తి మీకు తెలుసా?... శ్రీకృష్ణాష్టమి విశిష్టత.. ఆధ్యాత్మిక సందేశం ఇదే మట్టి గణపతి విగ్రహాలనే ప్రతిష్టించండి - పర్యావరణాన్ని కాపాడండి అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఉద్యోగుల రిలే నిరాహార దీక్ష పోస్టల్ శాఖలో 23,757 ఉద్యోగాలు మెడికొండూరు: బయ్యటపడ్డ ఇనుప చువ్వలు.. ప్రమాదానికి ఆహ్వానం
Date of Publish : 04 June 2026, 07:48 pm
Posted by : V శ్రీనివాస్

ధాన్యం, మొక్కజొన్నల దిగుమతిని వేగవంతం చేయాలి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
04 Jun, 2026 - 07:48 PM
195 వీక్షణలు

ధాన్యం, మొక్కజొన్నల దిగుమతిని వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

​నస్పూర్ గోదాముల తనిఖీ; హమాలీల కూలి సకాలంలో చెల్లించాలని సూచన

 ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగంగా వివిధ కొనుగోలు కేంద్రాల నుండి తరలించిన ధాన్యాన్ని, మొక్కజొన్నలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేగంగా దిగుమతి చేసుకోవాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను, గోదాం నిర్వాహకులను కోరారు. గురువారం జిల్లాలోని నస్పూర్ మండల కేంద్రంలో గల స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ గోదామును మండల తహసిల్దార్ సంతోష్ కుమార్‌తో కలిసి ఆయన ఆకస్మికంగా సందర్శించి, అక్కడ జరుగుతున్న ధాన్యం, మొక్కజొన్నల దిగుమతి ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి, కేటాయించిన మిల్లులు, గోదాములకు తరలిస్తున్నామని స్పష్టం చేశారు. గోదాములకు వచ్చిన ధాన్యంతో పాటు మొక్కజొన్నలను కూడా త్వరితగతిన దిగుమతి చేసి భద్రపరచాలని, ఎక్కడా ఎలాంటి జాప్యం జరగకూడదని సూచించారు. అదేవిధంగా, హమాలీల కూలి వేతనం చెల్లింపుల అంశంపై పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ (డిఎం)తో ఫోన్ ద్వారా మాట్లాడి, హమాలీలకు సకాలంలో కూలి డబ్బులు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ తనిఖీ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, గోదాం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు