BREAKING
శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..!
Date of Publish : 24 July 2026, 01:55 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఢిల్లీ లాఠీచార్జీకి నిరసనగా మధిరలో విద్యార్థి సంఘాల బంద్

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jul, 2026 - 01:55 PM
44 వీక్షణలు

ఖమ్మం జిల్లా, మధిర: ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసుల లాఠీచార్జీని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు శుక్రవారం చేపట్టిన బంద్‌కు మధిరలో విశేష స్పందన లభించింది. మధిర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు తరగతులను బహిష్కరించి నిరసన కార్యక్రమం నిర్వహించారు.

కళాశాల ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యను ఖండిస్తూ, ప్రజాస్వామ్య హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మడపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ, శాంతియుతంగా తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులపై లాఠీచార్జీ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని విమర్శించారు. విద్యార్థుల స్వరాన్ని అణచివేసే ప్రయత్నాలను సహించబోమని, ఘటనకు బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

డిమాండ్లు పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా, అవసరమైతే దేశవ్యాప్తంగా కూడా విద్యార్థి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఎస్‌ఎఫ్‌ఎౖ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.