BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 25 March 2026, 09:34 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

ధరణి లోపాలతో పేదరైతుకు తప్పని తిప్పలు

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
25 Mar, 2026 - 09:34 PM
174 వీక్షణలు

ధరణి లోపాలతో పేదరైతుకు తప్పని తిప్పలు: సాక్ష్యంగా పాత పట్టా ఉన్నా పట్టించుకోని అధికారులు!

వెల్గటూర్ (పాషిగామ):

తెలంగాణ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన కోసం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ లోని లోపాలు ఒక నిరుపేద మహిళా రైతుకు శాపంగా మారాయి. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న తన సొంత భూమి, రికార్డుల్లో అకస్మాత్తుగా 'ప్రభుత్వ భూమి'గా మారిపోవడంతో ఆ వృద్ధురాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

​వివరాల్లోకి వెళ్తే..

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాషిగామ గ్రామానికి చెందిన ఉపారపు నర్సమ్మకు సర్వే నంబర్ 1090/2/1 లో 30 గుంటల భూమి ఉంది. భర్త మల్లయ్య మరణానంతరం ఆమె ఆ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆమెకు ఈ భూమిపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం పట్టాదారు పాసుపుస్తకం (ఖాతా నంబర్: 1687) జారీ చేసింది. దీనికి సంబంధించి ఆమె వద్ద పాత పాసుపుస్తకం సాక్ష్యంగా ఉంది.

​రికార్డుల్లో పొరపాటు.. అందని పట్టా:

గత ప్రభుత్వ హయాంలో కొత్త పాసుపుస్తకం కోసం నర్సమ్మ అప్పట్లోనే రూ. 300 చలాన్ కూడా చెల్లించారు. కానీ, రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణ సమయంలో ఆమె పట్టా భూమిని పొరపాటున 'ప్రభుత్వ భూమి'గా నమోదు చేశారు. అప్పట్లో విఆర్వో వ్యవస్థ రద్దు కావడం, ధరణిలో పేరు మార్పునకు సరైన ఆప్షన్లు లేకపోవడంతో ఆ భూమి రికార్డుల్లో ప్రభుత్వ పరమైపోయింది.

​బాధితురాలి ఆవేదన:

"నా దగ్గర పాత పాసుపుస్తకం ఉంది.. చలాన్ కట్టిన రసీదు ఉంది. అదే సర్వే నంబర్ లో మిగతా వారికి పట్టా పుస్తకాలు ఇచ్చారు.. నాకెందుకు ఇవ్వడం లేదు?" అని నర్సమ్మ కంటతడి పెట్టారు. ప్రస్తుతం పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు రకరకాల ఆధారాలు కోరుతూ తిప్పుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు స్పందించి, తన పాత రికార్డులను పరిశీలించి రికార్డుల్లో పేరు మార్చాలని, తనకు పట్టా పాసుపుస్తకం ఇప్పించి న్యాయం చేయాలని ఆమె వేడుకుంటున్నారు.