BREAKING
thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి thumb ● సంస్థాన్ నారాయణపురంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఇందిరమ్మ ఇళ్లలో తొలి దీపావళి.. లబ్ధిదారుల ఇళ్లలో పండుగ సందడి thumb ● నారాయణపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● MLC ఓటు నమోదుకు మరో అవకాశం.. డిసెంబర్ 10 వరకు గడువు thumb ● తూప్రాన్‌లో ఘనంగా ఎస్‌జీఎఫ్‌ఐ నెట్‌బాల్ సెలక్షన్ కమ్ ట్రయల్స్ thumb ● ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జోనల్ ఇన్‌చార్జిగా కోల మహేష్ thumb ● ఎమ్మెల్యే వేముల వీరేశం నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు thumb ● చిట్యాలలో విషాదం.. రైలుకు ఎదురెళ్లి వ్యక్తి ఆత్మహత్య thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో నల్లగొండ జిల్లా టాప్ thumb ● మేడారం నుంచి తిరిగొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Test 4
Date of Publish : 08 November 2026, 10:00 am
Posted by : కూనురు మధు

గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో ఘనంగా దీపావళి సంబరాలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
08 Nov, 2026 - 10:00 AM
58 వీక్షణలు

Ntoday News:చిట్యాల 

నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ గ్రోవ్ పాఠశాలలో శనివారం ముందస్తు దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి సందడి చేశారు. పాఠశాల ఆవరణలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దీపాలతో అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ పూలకంటి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ చెడుపై మంచి, చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామని తెలిపారు. శ్రీరాముడు రావణాసురుడిపై విజయం సాధించి అయోధ్యకు తిరిగి వచ్చిన సందర్భంగా ప్రజలు దీపాలు వెలిగించి స్వాగతం పలికిన చారిత్రక, పౌరాణిక నేపథ్యం ఈ పండుగకు ప్రత్యేకతను చేకూర్చిందన్నారు. దీపావళి పండుగ కేవలం దీపాలు వెలిగించడం, బాణసంచా కాల్చడానికే పరిమితం కాదని, మనలోని అజ్ఞానం, అహంకారం, చెడు ఆలోచనలను తొలగించుకొని మంచి మార్గంలో నడవాలనే సందేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగల విశిష్టతను చిన్ననాటి నుంచే విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రేమ, సోదరభావం, ఐక్యతతో పండుగలను జరుపుకోవాలని, పర్యావరణానికి హాని కలగకుండా కాలుష్యరహిత దీపావళిని జరుపుకోవాలని సూచించారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, సిరిసంపదలు, వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.