BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 24 September 2026, 12:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ స్పాట్ అడ్మిషన్లు

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Sep, 2026 - 12:47 PM
8 వీక్షణలు

సెప్టెంబర్ 24, 25 తేదీల్లో స్పాట్ అడ్మిషన్లు.. 28, 29 తేదీల్లో వన్‌టైమ్ స్పెషల్ స్పాట్ అడ్మిషన్లు

మధిర: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మధిరలో దోస్త్–2026–27లో మిగిలి ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు సెప్టెంబర్ 24, 25 తేదీల్లో, వన్‌టైమ్ స్పెషల్ స్పాట్ అడ్మిషన్లు సెప్టెంబర్ 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. రవీంద్రారెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంబంధిత తేదీల్లో కళాశాలకు నేరుగా హాజరై ఒరిజినల్ సర్టిఫికెట్లతో ధ్రువీకరణ చేయించుకోవాలని సూచించారు. ఒరిజినల్ సర్టిఫికెట్ల ధ్రువీకరణ లేకుండా స్పాట్ అడ్మిషన్లకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

వన్‌టైమ్ స్పెషల్ స్పాట్ అడ్మిషన్లలో ముందుగా స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామని, స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేని సందర్భంలో మిగిలిన సీట్లను నాన్‌లోకల్ అభ్యర్థులకు కేటాయిస్తామని తెలిపారు. ఇప్పటికే ఏదైనా కళాశాలలో అడ్మిషన్ పొందిన అభ్యర్థులను స్పాట్ అడ్మిషన్లకు పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొన్నారు.

అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ మార్కుల మెమో, ఇంటర్మీడియట్ లేదా సమానమైన సర్టిఫికెట్, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్ల ఒరిజినల్స్‌తో పాటు వర్తించే సందర్భంలో కుల, ఆదాయ, నివాస, బ్రిడ్జ్ కోర్సు సర్టిఫికెట్లను వెంట తీసుకురావాలని సూచించారు. స్పాట్ అడ్మిషన్ల ద్వారా చేరిన అభ్యర్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని తెలిపారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మధిరలో పీహెచ్‌డీ, సెట్, నెట్ అర్హతలు కలిగిన అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డా. ఎం. రవీంద్రారెడ్డి తెలిపారు.

మరిన్ని వివరాల కోసం కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం. రవీంద్రారెడ్డి 9440257256, వైస్ ప్రిన్సిపాల్ జి. అరుణ 9441786508, దోస్త్ సమన్వయకర్త డా. ఎస్. ఇందిర 9553359879, డా. పి. సుజాత 9177734879లను సంప్రదించవచ్చని తెలిపారు.