BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 23 January 2026, 08:38 am
Posted by : NTODAY NEWS OFFICIAL

దుర్గాదేవి ఆలయ నిర్మాణ పూజలు

తెలంగాణ
23 Jan, 2026 - 08:38 AM
325 వీక్షణలు
గొల్లపల్లిలో వైభవంగా శ్రీ కాలభైరవ సహిత అష్టభుజ దుర్గాదేవి ఆలయ నిర్మాణ పూజలు NTODAY NEWS: గొల్లపల్లి మండలం ప్రతినిధి లక్ష్మణ్ గొల్లపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ కాలభైరవ సహిత అష్టభుజ దుర్గాదేవి ఆలయ నిర్మాణ పనులు శుక్రవారం పండుగ వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే భూమి పూజ, పునాది పనులు పూర్తికాగా, వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ గోడల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు విశ్వావసు నామ సంవత్సర మాఘ మాస శుద్ధ పంచమి తిథిని పురస్కరించుకుని ఉదయం 10:25 గంటలకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 108 ఇటుకలకు శాస్త్రోక్తంగా పూజలు చేసి గోడల నిర్మాణ పనులను ప్రారంభించారు. సర్పంచ్ పాల్గొనడం గ్రామ సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని స్వయంగా ఇటుకలను ఉంచి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో అమ్మవారి ఆలయ నిర్మాణం జరగడం శుభసూచకమని, లోకకళ్యాణార్థం చేపట్టిన ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు. భక్తుల కోలాహలం ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కమిటీ సభ్యులు కోరారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిగింది. Follow us on Website Facebook Instagram YouTube