BREAKING
thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు thumb మూలపేటలో ఘనంగా శ్రీ గంగాలమ్మ తల్లి పండగకు ఏర్పాట్లు thumb ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసిన ఊరుమడ్ల గ్రామ నాయకులు thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు thumb దోర్నాల మండలానికి అందించిన సేవలు అభినందనీయం. thumb గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. స్లీపర్ బస్సులో మంటలు.. thumb సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన thumb వాడపల్లి ఆలయంలో అభివృద్ధి పనులు ప్రారంభం thumb ర్యాలీ గ్రామంలో రూ.3.20 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం thumb దుర్గానగర్ కాలనీలో ఘనంగా గణేష్ నవరాత్రి సాంస్కృతిక వేడుకలు thumb తూర్పు గోదావరి జిల్లాలో పాఠశాలలకు రేపు సెలవు
Date of Publish : 10 August 2026, 10:56 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Aug, 2026 - 10:56 AM
68 వీక్షణలు

ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

ఉభయ సభలకు గవర్నర్ నోటిఫికేషన్.. నాలుగు రోజుల పాటు నిర్వహించే అవకాశం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలకు రంగం సిద్ధమైంది. సమావేశాల నిర్వహణకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 17వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండగా.. ఉదయం 10 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలుకానున్నాయి.

సమావేశాల వ్యవధిపై ఇంకా తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఎన్ని రోజుల పాటు ఉభయ సభలను నిర్వహించాలనే అంశంపై శాసనసభ, శాసన మండలి బిజినెస్ అడ్వైజరీ కమిటీలు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నాయి. అయితే ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి వర్షాకాల సమావేశాలను సుమారు నాలుగు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తదితర అంశాలపై అధికార, ప్రతిపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను సభల వేదికగా వెల్లడించనున్నారు.

అదే సమయంలో ప్రభుత్వం పలు కీలక బిల్లులను సభ ముందుకు తీసుకువచ్చి చర్చ అనంతరం ఆమోదం పొందేలా చర్యలు చేపట్టనుంది. వివిధ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు, పరిపాలనా అంశాలు కూడా సమావేశాల సందర్భంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.

సభా కార్యక్రమాల క్రమం, చర్చించాల్సిన అంశాలు, బిల్లుల ప్రవేశపెట్టడం వంటి విషయాలపై బీఏసీ సమావేశాల్లో స్పష్టత రానుంది. దీంతో ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.