BREAKING
thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు thumb ● గుంతలమయంగా మారిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి thumb ● పాకాల తిరుపతి జిల్లా,ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల ర్యాలీ thumb ● సుదర్శన్‌ను పరామర్శించిన వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ thumb ● కదిరిలో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి thumb ● వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వాలి.... thumb ● కూలేందుకు సిద్ధంగా సిగ్నల్ లైట్స్ స్తంభం thumb ● పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తాం thumb ● బాలాపూర్ సరికొత్త రికార్డు.. వేలంలో రూ.39 లక్షలు పలికిన గణేష్ లడ్డూ thumb ● వెలిచేరు పంట పొలాల్లో నిలిచిన వర్షపు నీటి తొలగింపు thumb ● వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ.2.50 కోట్లు
Date of Publish : 11 August 2026, 04:38 pm
Posted by : NTODAY NEWS

ఈఎస్ఐ మల్టీ స్పెషాలిటీ వంద పడకల ఆసుపత్రి మంజూరు కై ఏఐటియుసి పోరు

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
NTODAY NEWS ప్రతి క్షణం - ప్రజల పక్షం
11 Aug, 2026 - 04:38 PM
57 వీక్షణలు

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పానుగంటి పర్వతాలు

మహేశ్వరం:- ఎన్ టుడే న్యూస్

రంగారెడ్డి జిల్లా పారిశ్రామిక కార్మికుల కోసం ఇతర ఎంప్లాయిస్ ల కోసం మల్టీ స్పెషాలిటీ ఈఎస్ఐ 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పానుగంటి పర్వతాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు 

 ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తనాయక్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం ఈరోజు జాయింట్ కలెక్టర్. ను కలిసి ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరు కోసం వినతి పత్రం అందజేశారు  

 ఈ సందర్భంగా పర్వతాలు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో వందలాది పరిశ్రమలు ఉన్నాయి వాటిలో లక్షలాదిమంది ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారు . ప్రైవేట్ సెక్టార్ తో పాటు ప్రభుత్వ సెక్టార్లు ఇతర ఉద్యోగులు సుమారు 20 లక్షల వరకు పనిచేస్తున్న ఈ జిల్లాలో ఈఎస్ఐ ఆసుపత్రి లేకపోవడం వల్ల సనత్ నగర్ లేదా నాచారం వెళ్లి చూయించుకోవడానికి కార్మికులు ఒకరోజు సెలవు పెట్టి వెళ్లాల్సిన స్థితి ఉందని ఆయన తెలిపారు 

 ప్రభుత్వాలు కార్మికులకు అందుబాటులో ఉండే విధంగా ఆసుపత్రిని నిర్మించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు 

 చాలీచాలని వేతనాలతో బ్రతుకు బండి లాగే కార్మికులు ఏదైనా పెద్ద రోగం వస్తే రోజులు తరబడి ఆసుపత్రులు చుట్టూ తిరిగి వేతనాలు కోల్పోయి ఆరోగ్యం పాడు చేసుకునే దుర్భరస్థితిగతులు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయని అందుకోసమే ఈఎస్ఐ ఆసుపత్రిని జిల్లాలో నిర్మించాలని ఏఐటియుసి డిమాండ్ చేస్తున్నది 

 ప్రభుత్వం పట్టించుకోకపోతే రాబోయే కాలంలో కార్మికుల పక్షాన ఈఎస్ఐ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం ఆందోళన పోరాటాలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు 

 జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తనాయక్ మాట్లాడుతూ పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదని అనేక పరిశ్రమలలో ఈఎస్ఐ అమలు చేయడం లేదని ఆయన అన్నారు

 పరిశ్రమలలో పనిచేసే కార్మికుల కనీస వేతనాలు అమలు చేయకుండా ఈఎస్ఐపిఎఫ్ లాంటి మౌలిక వసతులను అమలు చేయని కంపెనీ యాజమాన్యాల మీద ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకపోతే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉదృతం చేస్తామని ఆయన తెలిపారు 

 వినతి పత్రం ఇచ్చిన వారిలో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు కే రామస్వామి జిల్లా అధ్యక్షుడు వడ్ల సత్యనారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ పబ్బతి లక్ష్మణ్ జిల్లా సహాయ కార్యదర్శి నాగరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు కొమ్మ గళ్ళ రాజు మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు మంజుల తదితరులు పాల్గొన్నారు.