BREAKING
thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు
మంచి మాట
Date of Publish : 15 September 2026, 04:15 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఏలూరు జిల్లా: మాజీ మంత్రి ఆళ్ల నాని కన్నుమూత

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
15 Sep, 2026 - 04:15 PM
145 వీక్షణలు

మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) గుండెపోటుతో మృతి చెందారు. విశాఖపట్నంలోని సీతమ్మధారలోని తన నివాసంలో మంగళవారం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు, అనుచరులు ఆందోళనకు గురయ్యారు. అయితే చికిత్స అందించేలోపే ఆయన మృతి చెందినట్లు సమాచారం.

ఆళ్ల నాని రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ పార్టీతో ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యేగా ఎన్నికై, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.

జగన్ ప్రభుత్వంలో వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు, కార్యక్రమాల్లో ఆళ్ల నాని భాగస్వామ్యమయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇటీవల ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరారు. రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న సమయంలోనే ఆయన ఆకస్మికంగా మృతి చెందడం ఏలూరు జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.