BREAKING
thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం thumb ● ఇటిక్యాలలో అంగన్ మిలన్ సేవ కార్యక్రమం thumb ● గాంధీ, శాస్త్రి విగ్రహాలకు ఎమ్మెల్యే గళ్ళా మాధవి నివాళులు thumb ● సంస్థాన్ నారాయణపురంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు thumb ● పట్టాభిపురంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి thumb ● లోతట్టు ప్రాంత సమస్యను పరిష్కరించాలి thumb ● ఆరోగ్యశ్రీ ఉద్యోగుల హక్కుల సాధనకై తుర్కయాంజాల్‌లో రాష్ట్ర స్థాయి సమావేశం thumb ● చంద్రబాబు పర్యటనకు తరలివెళ్లిన లద్దిగం నుంచి టీడీపీ శ్రేణుల thumb ● తక్కెపహాడ్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుపై వివాదం thumb ● గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ thumb ● సఫాయి మిత్రుల సేవలు అభినందనీయం
Date of Publish : 18 August 2026, 01:17 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎమ్మెల్సీ నాగబాబుకు మంత్రి పదవి లభిస్తుందా..? కొనసాగుతున్న ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 Aug, 2026 - 01:17 PM
69 వీక్షణలు

క్యాబినెట్ హోదాతో కీలక బాధ్యతలు.. మంత్రివర్గంలో చోటుపై ఆసక్తి

ఆంధ్రప్రదేశ్

జనసేన పార్టీ ఎమ్మెల్సీ నాగబాబుకు కూటమి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పదవికి క్యాబినెట్‌ స్థాయి హోదా కల్పించడంతో ఆయనకు ప్రభుత్వంలో మరింత ప్రాధాన్యత పెరిగింది.

గతంలో నాగబాబుకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా నియామకం తర్వాత ఆయనకు మంత్రి పదవి కూడా దక్కుతుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాగబాబు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తారని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆయనకు లభించిన క్యాబినెట్ హోదా పదవి ద్వారా పరిపాలనలో భాగస్వామ్యం కల్పించినప్పటికీ, ప్రత్యక్షంగా మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అన్నది భవిష్యత్ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.

కూటమి ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ జరిగే సమయంలో రాజకీయ సమీకరణాలు, శాఖల కేటాయింపులు, కూటమి భాగస్వామ్యాల ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో నాగబాబుకు మంత్రి పదవి వస్తుందా..? లేక ప్రస్తుత క్యాబినెట్ హోదా బాధ్యతలతోనే కొనసాగుతారా..? అన్న అంశంపై ఆసక్తి నెలకొంది.