BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

ఎన్డీఏ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది: సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ నేత హరినాథ్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:46 PM
10 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డి. హరినాథ్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 1975 జూన్ 25 ఎమర్జెన్సీని బీజేపీ "సంవిధాన్ హత్యా దివస్", "రాజ్యాంగ హత్యా దినోత్సవం"గా పేర్కొనడం హాస్యాస్పదమని అన్నారు.

ఎన్డీఏ పాలనలో దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందని, కనీస పౌర హక్కులు కూడా క్రమంగా హరించబడుతున్నాయని ఆరోపించారు. విప్లవకారులు, ప్రజాస్వామ్యవాదులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని, స్టాన్ స్వామి, ప్రొఫెసర్ సాయిబాబా వంటి కేసులను ప్రస్తావించారు.

"ఆపరేషన్ కగార్" పేరుతో మావోయిస్టు కార్యకర్తలను ఎన్‌కౌంటర్లలో హతమార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ సవరణ ప్రయత్నాలను 2024 ఎన్నికల్లో ప్రజలు తిప్పికొట్టారని వ్యాఖ్యానించారు.

బీహార్‌లో ఎన్నికల ముందు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సర్క్యులర్‌ను ప్రస్తావిస్తూ, దానిని "ఓటు హక్కు హరణ దినోత్సవం"గా పిలవాలని సిపిఐ(ఎంఎల్) లిబరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిపాంకర్ భట్టాచార్య పిలుపునిచ్చారని తెలిపారు.

విజయవాడలో సాయి కృష్ణ ఘటనను ప్రస్తావిస్తూ, ప్రజల నిరసనల నేపథ్యంలో సీఐ అరెస్టు కావడం, సిట్ విచారణకు ఆదేశాలు జారీ కావడం ప్రజా ఒత్తిడి ఫలితమని పేర్కొన్నారు.

నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా యువత చేపడుతున్న ఆందోళనలకు మద్దతు తెలుపుతూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. మతోన్మాద, ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులు ఐక్యంగా ఉద్యమించి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని హరినాథ్ విజ్ఞప్తి చేశారు.