BREAKING
thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం
Date of Publish : 19 April 2026, 06:57 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

నరసాపురం నుండి చింతలపూడి ప్రధాన రహదారి మరమ్మతులకు కరువు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Apr, 2026 - 06:57 PM
207 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా నరసాపురం నుండి ఏలూరు జిల్లా చింతలపూడి ప్రధాన రహదారి మరమ్మతులకు కరువు

ఎన్టీఆర్ జిల్లా నరసాపురం నుండి ఏలూరు జిల్లా చింతలపూడి ప్రధాన రహదారి లో నరసాపురం-చాట్రాయి మధ్య ఆర్ & బి ప్రధాన రహదారి నాలుగు ఐదు చోట్ల భారీ వాహనాలు నడవడంతో రోడ్డు కృంగి పోయింది. భూమిలోనికి కృంగిపోయిన రోడ్డు వలన వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కార్లు బాడీ క్రింద రోడ్డు తగిలే పరిస్థితి నెలకొంది. గత నాలుగైదు నెలల నుండి ఈ పరిస్థితి కొనసాగుతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విస్సన్నపేట నుంచి చింతలపూడి మధ్య ప్రధాన రహదారి గుట్ట ప్రాంతం వలన నిత్యం వేల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. దీనికి తగిన మరమ్మత్తులు చేయకపోవడం వలన వాహనదారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ రహదారి సింగిల్ రోడ్డు కావడంతో ప్రమాదాలు జరగటానికి అవకాశం అధికంగా ఉంటుంది. వాహనదారులు ఎప్పుడైనా ప్రాణనష్టం జరగడం కాకుండా ముందే ఆర్ & బి అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించవలసిన అవసరం ఏర్పడింది.

ప్రస్తుత పరిస్థితి అనుభవిస్తున్న వాహనదారులు "ప్రాణాలు పోయే పరిస్థితిలో మార్పులు తీసుకురావడం ఎంతమాట?" అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు వాహనదారులు, "సరిగ్గా దృష్టిని పెట్టి ఈ సమస్యను పరిష్కరించకపోతే అనుకోకుండా ప్రాణహాని సంభవించవచ్చు," అని హెచ్చరించారు.

ఈ రహదారిని తిరిగి సురక్షితంగా మారుస్తే ప్రమాదాలు తగ్గి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాగుతుంది.