BREAKING
thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Date of Publish : 28 August 2026, 03:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో నగర పోలీస్ కమిషనర్‌కు రాఖీలు కట్టిన మహిళా అధికారులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 03:51 PM
106 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని నగర పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పవిత్రమైన రాఖీ పండుగ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర బాబుకు అడ్మిన్ డీసీపీ కె.జి.వి.సరిత రాఖీ కట్టి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

అడ్మిన్ డీసీపీతో పాటు పలువురు మహిళా పోలీస్ అధికారులు, వివిధ పాఠశాలల విద్యార్థినీలు కమిషనర్‌కు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ సోదరభావానికి, ఒకరికొకరు అండగా ఉంటామనే నమ్మకానికి ప్రతీక అని పేర్కొన్నారు. విజయవాడ నగరంలోని మహిళల భద్రత, రక్షణకు పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని తెలిపారు.

రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపిన మహిళా అధికారులు, పోలీస్ సిబ్బందికి కమిషనర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అందరికీ రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.