BREAKING
thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు
Date of Publish : 12 May 2026, 07:04 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎర్రవారిగూడెంలో దొంగతనాల నియంత్రణపై పోలీసుల అవగాహన సదస్సు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 May, 2026 - 07:04 AM
167 వీక్షణలు

ఎర్రవారిగూడెంలో దొంగతనాల నియంత్రణపై పోలీసుల అవగాహన సదస్సు

ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఆదేశాలు, నూజివీడు డీఎస్పీ కె.వి.వి.ఎన్.వి. ప్రసాద్ సూచనల మేరకు చాట్రాయి మండలం ఎర్రవారిగూడెం గ్రామంలో దొంగతనాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. “సురక్షిత గ్రామం మన లక్ష్యం” అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ, చాట్రాయి ఎస్ఐ డి. రామకృష్ణ, ముసునూరు ఎస్ఐ చిరంజీవి గ్రామస్థులతో కలిసి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రజల ఆస్తి పాస్తుల రక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయమని తెలిపారు.

దొంగతనాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామస్థులకు పలు కీలక సూచనలు చేశారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లు, వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే నేరస్తులను త్వరగా గుర్తించి పట్టుకోవచ్చని వివరించారు.

ఇళ్లలో భారీ మొత్తంలో నగదు, బంగారం నిల్వ ఉంచడం ప్రమాదకరమని, వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఊరికి వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం అందిస్తే, LHMS (లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్) ద్వారా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని తెలిపారు.

గ్రామంలోకి కొత్త వ్యక్తులు వచ్చినా, పాత సామాన్లు కొనుగోలు చేస్తున్నామంటూ తిరిగే వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఏదైనా అత్యవసర పరిస్థితి లేదా దొంగతనం జరిగినప్పుడు వెంటనే 112కు కాల్ చేయాలని సూచించారు. పోలీసులతో పాటు గ్రామస్థులు కూడా రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉంటూ సామాజిక పెట్రోలింగ్‌లో భాగస్వామ్యం కావాలని కోరారు.

పోలీసు పెట్రోలింగ్‌కు ప్రజల సహకారం కూడా కలిసివస్తేనే నేరరహిత సమాజం సాధ్యమవుతుందని, సాంకేతికతను వినియోగించుకుని ప్రజలు తమ ఆస్తులను రక్షించుకోవాలని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.